: ఆ ఆలయంలో నిన్ననే స్వాతంత్ర్య దినోత్సవం జరిపారు!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం దేశమంతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి వేడుకలకు పలుచోట్ల సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అయితే మధ్యప్రదేశ్ లోని పశుపతినాథ్ దేవాలయంలో మాత్రం రెండు రోజుల ముందుగానే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిపారు. అదెలాగా? అని అనుకుంటున్నారు కదా. వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్ లో మందసౌర్ జిల్లాలో పశుపతి నాథ్ ఆలయం ఉన్న విషయం తెలిసిందే. అక్కడ హిందూ క్యాలెండర్ ప్రకారం నిన్న స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు నిర్వహించారట. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చింది. హిందూ పంచాంగం ప్రకారం ఈ తేదీన శ్రావణమాసం చతుర్దశి, కృష్ణ పక్షం. ఉత్తరాది వారికైతే ఈ తేదీన శ్రావణమాసం. అందుకే గత ఇరవై సంవత్సరాల నుంచి హిందూ పంచాంగం ప్రకారమే స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆలయ ప్రధాన పూజారి వెల్లడించారు.