: చంద్రబాబుపై సి.రామచంద్రయ్య ఫైర్... 14 నెలల్లో కేంద్రం నుంచి ఏం సాధించారని నిలదీత


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ఏపీ శాసనమండలిలో కాంగ్రెస్ పక్షనేత సి.రామచంద్రయ్య కొద్దిసేపటి క్రితం విమర్శలు గుప్పించారు. అధికారం చేపట్టి 14 నెలలు గడుస్తున్నా కేంద్రం నుంచి ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు రాబట్టలేకపోయారని ఆయన ఆరోపించారు. గడచిన 14 నెలల్లో కేంద్రం నుంచి ఏం సాధించుకువచ్చారో చెప్పాలంటూ ఆయన చంద్రబాబును నిలదీశారు. ఓటుకు నోటు కేసు, పుష్కరాలకే చంద్రబాబు తన సమయాన్నంతా కేటాయించారన్నారు. రాష్ట్రాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ఆడించినట్లు ఆడుతున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News