: నిజామాబాద్ 'తెలంగాణ యూనివర్సిటీ' లైబ్రరీలో వైఫై సేవలు


నిజామాబాద్ లోని తెలంగాణ యూనివర్సిటీలో వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడి సెంట్రల్ లైబ్రరీలో వైఫై సేవలను ఎంపీ కవిత ఇవాళ ప్రారంభించారు. విద్యార్థులు 24 గంటల వైఫై సేవలు వినియోగించుకోవాలని ఆమె తెలిపారు. వర్సిటీకి ఇప్పటికే నిరంతర తాగునీరు, విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. వర్సటీలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయించే బాధ్యత తనదని చెప్పారు. వచ్చే సంవత్సరం నుంచి జీఆర్ఈ, టోఫెల్ లేకుండా 75 మంది విద్యార్థులు అమెరికా వెళ్లొచ్చని, ఇందుకు చికాగో యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నామని ఎంపీ ఈ సందర్భంగా వెల్లడించారు.

  • Loading...

More Telugu News