: హిందూపురంలో బాలయ్య... గడ్డపార చేతబట్టి అభివృద్ధి పనులకు శంకుస్థాపన
టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రెండు రోజులుగా అక్కడ పర్యటిస్తున్న ఆయన కొద్దిసేపటి క్రితం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తల కోలాహలం మధ్య గడ్డపార చేతబట్టిన బాలయ్య నేలను తవ్వి పనులను ప్రారంభించారు. బాలయ్య గడ్డపార చేతబడ్డగానే పురుషులతో పాటు మహిళలు కూడా ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు.