: ఏసీబీ వినతికి కోర్టు గ్రీన్ సిగ్నల్... రేవంత్, సండ్ర స్వర నమూనాలు ఎఫ్ఎస్ఎల్ కు!


ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు కొద్దిసేపటి క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి, మరో నిందితుడు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్వర నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరోటరీ (ఎఫ్ఎస్ఎల్)కు పంపేందుకు సమ్మతించింది. కేసులో కీలక సాక్ష్యాలుగా ఉన్న ఆడియో, వీడియో టేపుల్లోని స్వరాలతో నిందితుల స్వరాలను పోల్చాలన్న ఉద్దేశంతో కోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యాలయం రేవంత్, సండ్రల స్వర నమూనాలను నిన్న అందజేసిన సంగతి తెలిసిందే. వాటిని ఎఫ్ఎస్ఎల్ కు పంపాలని నిన్ననే ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఏసీబీ అధికారుల మెమోను విచారించిన కోర్టు, ఆ శాంపిళ్లను ఎఫ్ఎస్ఎల్ కు పంపేందుకు సమ్మతించింది.

  • Loading...

More Telugu News