: విజయవాడ క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలసిన 'మైక్రోసాఫ్ట్ ఇండియా' ఎండీ
సీఎం చంద్రబాబును విజయవాడలోని అధికారిక కార్యాలయంలో 'మైక్రోసాఫ్ట్ ఇండియా' ఎండీ అనిల్ బన్సాలీ భేటీ అయ్యారు. కేవలం మర్యాదపూర్వకంగానే సీఎంను కలసిన బన్సాలీ ఏపీలో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాల విస్తరణకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడినట్టు సమాచారం. రాష్ట్రాన్ని సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ హబ్ లుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ఇందుకు అనుగుణంగా విశాఖ, విజయవాడ, తిరుపతి, తదితర ప్రాంతాల్లో మైక్రోసాఫ్ట్ సంస్థ విస్తరణకు అవకాశాలపై చంద్రబాబు బన్సాలీకి వివరించారు.