: ఆ ముష్కరుల్లో ఇద్దరు బంగ్లాదేశీయులు, ఒకరు పాకిస్థానీ, మరొకరు మయన్మార్ దేశస్థుడట
హైదరాబాదు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల చేతికి చిక్కిన నలుగురు అనుమానితులు ఉగ్రవాదులేనన్న వాదనకు బలం చేకూరుతోంది. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండానే భారత భూభాగంలోకి చొరబడ్డ సదరు నలుగురు యువకులు నగరంలోని చంచల్ గూడ జైలు పరిసరాల్లో అక్రమంగా బస చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నలుగురిలో ఇద్దరు వ్యక్తులు బంగ్లాదేశ్ కు చెందిన వారు కాగా, ఓ వ్యక్తిని మయన్మార్ వాసి అని తేల్చిన పోలీసులు, నాలుగో వ్యక్తిది ఉగ్రవాదులకు నిలయమైన పాకిస్థాన్ అని రూఢీ చేసుకున్నారు. ఇక వీరికి ఆశ్రయం కల్పించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.