: గడ్డం పెంచితే ఉగ్రవాదే... సెలూన్లకు పరుగులు పెడుతున్న టర్కీ పురుషులు!


టర్కీలోని కుర్రాళ్లంతా సెలూన్ల వైపు పరుగులు పెడుతున్నారు. ఎందుకో తెలుసా? భారీగా పెరిగిన తమ గడ్డాలను తీయించుకునేందుకు. సిరియా వెళ్లి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో కలవాలని భావించేవారు టర్కీ మీదుగా ప్రయాణాలు చేస్తుండటం ఈ దేశ వాసులను కలవర పెడుతోంది. దీనికితోడు సరిగ్గా వారం క్రితం 19 మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పట్టుబడటం, వీరికి గడ్డాలు ఉండటంతో, గడ్డం పెంచుకున్న వారందరినీ ప్రజలు ఉగ్రవాదులుగా అనుమానించడం మొదలైంది. దీంతో ఫ్యాషన్, కొత్త స్టయిల్ అంటూ మీసాలు తీసి గడ్డాలు పెంచిన వారంతా, ప్రస్తుతం సెలూన్ల ముందు క్యూ కడుతున్నారు. దీంతో నిన్నమొన్నటి వరకూ అంతగా సాగని తమ వ్యాపారాలు, ఇప్పుడు జోరందుకున్నాయని బార్బర్లు ఆనందంగా చెబుతున్నారు.

  • Loading...

More Telugu News