: తలాబ్ కట్టలో బ్యాగ్ కలకలం... బాంబు ఉందని అనుమానిస్తున్న పోలీసులు


స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విధ్వంసానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రకు సంబంధించి ఒక్కొక్కటిగా ఆనవాళ్లు లభ్యమవుతున్నాయి. కొద్దిసేపటి క్రితం నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు మరో పిడుగు లాంటి వార్త అందింది. పాతబస్తీ పరిధిలోని తలాబ్ కట్టలో ఓ బ్యాగు పడి ఉందన్న సమాచారం అందింది. వెనువెంటనే అక్కడికి పరుగులు పెట్టిన పోలీసులు సదరు బ్యాగును చూసి బెంబేలెత్తిపోయారు. సదరు బ్యాగులో బాంబులు ఉండి ఉంటాయన్న అనుమానంతో హుటాహుటిన బాంబ్ స్క్కాడ్ కు సమాచారం అందించారు. మరోవైపు నగరంలోని కేపీహెచ్ బీ కాలనీలోనూ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో నగరంలో నేటి ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News