: పవన్ కల్యాణ్ వినతికి ఓకేనంటున్న ఏపీ సర్కారు!
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమయ్యే భూమిని రైతులకు ఇబ్బంది లేని పద్ధతుల్లోనే సేకరిస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వినతిని పరిగణనలోకి తీసుకుంటామని ఆయన ప్రకటించారు. రాజధాని అభివృద్ధిపై విజయవాడలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం సమీక్షించారు. ఈ సమీక్ష అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ కోరినట్లే రైతులెవరికీ ఇబ్బంది కలగని రీతిలోనే ల్యాండ్ పూలింగ్ చేపడతామని ఆయన పేర్కొన్నారు. అయితే రైతులు కూడా భూసేకరణ కంటే ల్యాండ్ పూలింగ్ కే మొగ్గు చూపాలని కూడా నారాయణ అన్నారు.