: అమరావతిలో 20 రెట్లు పెరిగిన భూమి విలువ


నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో గడచిన సంవత్సరం వ్యవధిలో భూముల విలువ 20 రెట్లు పెరిగిందని ఏపీ మంత్రి నారాయణ వెల్లడించారు. రూ. 10 లక్షల నుంచి 20 లక్షల వరకూ ఉన్న ఎకరం భూమి ధర నేడు రూ. 2 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకూ పలుకుతోందని అన్నారు. ఈ ఉదయం సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాజధాని సలహా మండలి సమావేశం జరుగగా, ఆ వివరాలను నారాయణ మీడియాకు తెలియజేశారు. సమీకరణలో భాగంగా భూములను ఇవ్వని రైతుల నుంచి ఈ నెల 20 తరువాత భూసేకరణ విధానంలో భూమిని స్వాధీనం చేసుకుంటామని ఆయన తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం మరో 2 వేల ఎకరాలను తీసుకోవాల్సి వుందని వివరించారు. ఈ సమావేశానికి సీఆర్డీఏ కమిషనర్, ఇతర అధికారులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News