: పోలీస్ స్టేషన్ లో రాధేమా... ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ముంబై పోలీసులు
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాను ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఆధ్యాత్మికత ముసుగులో రాధేమా అశ్లీలానికి తెర లేపారని పలువురు భక్తులు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరకట్న వేధింపులపైనా ఆమెపై నమోదైన కేసు నేపథ్యంలో విచారణకు హాజరుకావాలంటూ రాధేమాకు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాధేమా కొద్దిసేపటి క్రితం ముంబైలోని ఖండేవాలి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా రాధే మాపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అశ్లీలానికి ప్రాధాన్యమివ్వడంతో పాటు వరకట్న వేధింపులు, ఏడుగురి ఆత్మహత్యలకు కారణమైన వైనంపై ఆమె నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.