: కారం తినేవారికి మరింత ఆయుర్దాయం: కేంబ్రిడ్జి అధ్యయనం
కారం తినడం వల్ల బీపీ వంటి వ్యాధుల బారిన పడతామని భావిస్తూ, కారానికి దూరంగా ఉంటున్నారా? కారం తగ్గించడం కొంతవరకూ మంచిదే అయినా, పూర్తిగా మానేయరాదని పరిశోధకులు చెబుతున్నారు. కారం తినని వారికంటే, కారం తినేవారు ఎక్కువకాలం జీవిస్తున్నారట. ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్శిటీ సుమారు లక్షమందిని భాగస్వామ్యం చేస్తూ, ఏడేళ్ల పాటు నిర్వహించిన పరిశోధన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రధానంగా పచ్చి మిరప, ఎండు మిరప వేసి తయారు చేసే ఆహార పదార్థాలు తినేవారు మిగతా వారితో పోలిస్తే 10 శాతం వరకూ ఎక్కువ కాలం జీవిస్తున్నారని తెలిపింది. మిరపలో ఉండే కాప్సియాసిస్ అనే రసాయనమే ఇందుకు కారణమని, ఇది బలమైన యాంటీ ఆక్సిటెంట్ గా పనిచేసి ఊబకాయాన్ని దూరం చేస్తుందని వెల్లడించింది. క్యాన్సర్ కు వ్యతిరేకంగానూ పనిచేస్తుందని, పొడికారం తినడం కన్నా తాజా పచ్చి మిరపకాయలు వాడటం ఉత్తమమని సలహా ఇస్తోంది.