: లవణం మృతిపట్ల సీఎం చంద్రబాబు సంతాపం


ప్రముఖ నాస్తికవాది లవణం మృతిపట్ల సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా లవణం కళ్లను విజయవాడలోని ఓ స్వచ్చంధ సంస్థకు దానం చేశామని ఆయన సోదరుడు, ప్రముఖ వైద్యుడు సమరం తెలిపారు. ఆయన కోరిక మేరకు దేహాన్ని పిన్నమనేని వైద్య కళాశాలకు అప్పగించనున్నట్టు ఓ చానల్ తో మాట్లాడుతున్న సమయంలో చెప్పారు. అంతకంటే ముందు రేపు సాయంత్రం అంతిమయాత్ర నిర్వహిస్తామన్నారు. లవణం చనిపోవడం చాలా బాధగా ఉందని సమరం అన్నారు.

  • Loading...

More Telugu News