: అసోంలో తప్పిన పెనుముప్పు... రైల్వే ట్రాక్ పేల్చివేతకు ఉగ్రవాదుల కుట్ర, భగ్నం చేసిన పోలీసులు


అసోంలో గత రాత్రి భారత సైన్యం, పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్ లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల దాడులపై ముందస్తు సమాచారం అందుకున్న సైన్యం వేగంగా స్పందించింది. అసోం పోలీసులతో కలిసి ఉగ్రవాదులపై మెరుపు దాడి చేసింది. కోక్రాఝర్-గువాహటి మధ్యలో రైల్వే లైన్ పేల్చేసేందుకు ఉగ్రవాదులు పక్కాగా పథకం పన్నారు. ఇందులో భాగంగా రైల్వే ట్రాక్ పై బాంబులను కూడా అమర్చారు. అయితే ఉగ్రవాదుల కదలికలపై ముందుగా సమాచారం అందుకున్న సైన్యం, పోలీసులు అక్కడికి చేరుకుని బాంబులను నిర్వీర్యం చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో అక్కడే కాపు కాసిన ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులకు దిగారు. పోలీసుల ప్రతిదాడుల్లో ఓ ఉగ్రవాది హతం కాగా, మిగిలిన వారు పరారయ్యారు. కాల్పుల అనంతరం అక్కడ సోదాలు చేసిన పోలీసులు 7 కిలోల పేలుడు పదార్థాలు, రెండు గ్రనేడ్లు, ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News