: హైదరాబాదులో రేవంత్ రెడ్డి... ఓటుకు నోటు కేసు విచారణకు కోర్టుకు హాజరు


టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి మరోమారు హైదరాబాదులో కాలు మోపారు. ఓటుకు నోటు కేసు నేపథ్యంలో పాలమూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కొడంగల్ కే పరిమితమైన రేవంత్ రెడ్డి ఇటీవలే ఈ కేసు విచారణ నిమిత్తం హైదరాబాదుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నేటి ఉదయం కొడంగల్ నుంచి నేరుగా హైదరాబాదు చేరుకున్న రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టుకు వెళ్లారు. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉదయ సింహ, సెబాస్టియన్ తదితరులు కూడా ఏసీబీ కోర్టు విచారణకు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News