: పాక్ ప్రజలకు భారత ప్రధాని మోదీ ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్
పాకిస్థాన్ ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత భారత్, పాక్ లకు ఒకేసారి స్వాతంత్ర్యం సిద్ధించినప్పటికీ, ఆగస్టు 14న ఆ దేశం తమ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రజలకు గ్రీటింగ్స్ చెప్పారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ అకౌంట్ లో గ్రీటింగ్స్ పోస్ట్ చేశారు. ‘‘స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పాక్ ప్రజలకు శుభాకాంక్షలు’ అంటూ మోదీ ఆ ట్వీట్ లో వ్యాఖ్యానించారు.