: షేర్ హోల్డర్లకు సారీ చెప్పిన సైరస్ మిస్త్రీ... ఎందుకంటే...!


టాటా సన్స్ గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ టాటా మోటార్స్ కంపెనీ వాటాదార్లకు నిన్న క్షమాపణ చెప్పారు. అనివార్య కారణాల వల్ల ఈ ఏడాది డెవిడెండ్ చెల్లించలేకపోతున్నామని చెప్పిన ఆయన, అందుకు క్షమించాలని వాటాదార్లను వేడుకున్నారు. టాటా మోటార్స్ తన చరిత్రలోనే ఇప్పటిదాకా ఒకే ఒక్క ఏడాది (2000-01) మాత్రమే డెవిడెండ్ చెల్లించలేదు. తాజాగా మళ్లీ ఈ ఏడాది డెవిడెండ్ చెల్లించలేమని మిస్త్రీ నిన్నటి కంపెనీ ఏజీఎంలో చెప్పారు. అయితే సైరస్ మిస్త్రీ ప్రకటనపై వాటాదార్లు, ప్రధానంగా వయోవృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారట. కొత్త అకౌంటింగ్ చట్టాలతో పాటు కంపెనీ ఆర్థిక స్థితిగతులు డెవిడెండ్ చెల్లింపును అడ్డుకుంటున్నాయని చెప్పిన మిస్త్రీ, అందుకు క్షమించాలని వాటాదార్లను కోరారు.

  • Loading...

More Telugu News