: 151 మందిని పొట్టనబెట్టుకున్న ఆరుగురికి మరణశిక్ష విధించిన పాకిస్థాన్
పాకిస్థాన్, పెషావర్ లోని ఆర్మీ పాఠశాలపై దాడి చేసి 151 మంది చిన్నారులను నిర్దయగా కాల్చి చంపిన కేసులో పట్టుబడ్డ ఆరుగురు నిందితులకు మరణశిక్షను విధిస్తున్నట్టు ఆర్మీ కోర్టు వెల్లడించింది. ఈ దురాగతం పాకిస్థాన్ పై జరిగిన అత్యంత కిరాతక ఉగ్రదాడుల్లో ఒకటిగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పారదర్శకంగా విచారణ జరిగిందని, మరణశిక్ష పడ్డ నిందితులందరికీ చట్టపరమైన హక్కులుంటాయని, వీరు పై కోర్టులో అపీలు చేసుకోవచ్చని మిలటరీ అధికార వెబ్ సైట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో ప్రమేయమున్న ఏడో వ్యక్తికి యావజ్జీవ శిక్షను విధిస్తున్నట్టు కోర్టు తీర్పిచ్చింది.