: నవ్యాంధ్రలో రాజ్ భవన్, అసెంబ్లీ భవనాలకు రూ.500 కోట్లు... ఏపీకి కేంద్రం లేఖ


నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించనున్న రాజ్ భవన్, అసెంబ్లీ భవన నిర్మాణాలకు చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. రెండు భవనాల నిర్మాణం కోసం రూ.500 కోట్లను విడుదల చేస్తామని, తక్షణమే ఆ భవనాల డిజైన్లు పంపాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి ఏపీ ప్రభుత్వానికి లేఖ అందిందట. ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందేనని ఏపీ కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తోందన్న విషయంపై రాష్ట్రంలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఈ లేఖ రావడం పట్ల ఆసక్తికర చర్చ నడుస్తోంది.

  • Loading...

More Telugu News