: హైదరాబాదుపై ఆధిపత్యం కోసం చంద్రబాబు కుట్రపన్నుతున్నారు: హరీష్ రావు


హైదరాబాదుపై ఆధిపత్యం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మెదక్ లో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదును చండీఘడ్ తో పోల్చడం సరికాదని అన్నారు. హైదరాబాదు తెలంగాణ రాజధాని అని, తెలంగాణలో అంతర్భాగం అని చంద్రబాబుకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదుపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. చంద్రబాబు చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు హైదరాబాదు గురించి మాట్లాడుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News