: భూసేకరణపై స్పందించిన పవన్ కల్యాణ్


జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. గతంలో ప్రత్యేకహోదాపై ఆచి తూచి స్పందించిన పవన్ కల్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూసేకరణపై ఇప్పుడు సూటిగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం అమరావతి పరిసర ప్రాంతాల్లోని భూసమీకరణకు అంగీకరించని వారి భూములను భూసేకరణ చట్టం ప్రయోగించి సేకరించరని ఆశిస్తున్నానని అన్నారు. సామరస్య పూర్వక వాతావరణంలో అక్కడి వారి సమస్యలు పరిష్కరించి, వారిని ఒప్పించి టీడీపీ ప్రభుత్వం భూసేకరణ చేపడుతుందని ఆశిస్తున్నానని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆ భూములను ఎలాగైనా తీసుకుంటామని మంత్రి నారాయణ చెబుతున్న నేపథ్యంలో, పవన్ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

  • Loading...

More Telugu News