: కర్ణాటక రిజర్వాయర్ తో మూడు జిల్లాలకు నష్టం: ఎర్రబెల్లి
కర్ణాటకలోని గిరిజాపూర్ దగ్గర ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రిజర్వాయర్ కారణంగా తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. ఈ రిజర్వాయర్ ను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెక్ డ్యాం పేరిట రిజర్వాయర్ నిర్మిస్తున్నారని అన్నారు. దీనిపై తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఆయన చెప్పారు. ఈ రిజర్వాయర్ కారణంగా మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎగువన ఉన్న కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టుల కారణంగా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.