: స్త్రీ, పురుషుల మెదడు పనితీరులో తేడా ఉందట!


అవును, మెదడు పని తీరులో లింగ భేదం వుందట. స్త్రీ, పురుష భేదాన్ని బట్టి మెదడు మాలిక్యులర్ స్థాయి పని తీరులో తేడా ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఏదయినా విషయాన్ని నేర్చుకోవడం, జ్ఞాపకం ఉంచుకోవడం, స్పందించడం వంటి అంశాలపట్ల స్త్రీ, పరుషుల మెదడు స్పందనలో మార్పులు ఉంటాయని వారు వెల్లడించారు. డ్రగ్స్ పట్ల స్త్రీ, పురుషుల మెదడు వేర్వేరుగా స్పందించే అవకాశముందని చెప్పేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే స్త్రీ, పరుషులపై ఒకేరకంగా పనిచేసే ముందులు తయారు చేసేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News