: బాగ్దాద్ పేలుడుకు తామే కారణమని ప్రకటించుకున్న ఐఎస్ఐఎస్


ఈ ఉదయం ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని సదర్ ప్రాంతంలో ఉన్న జమీలా మార్కెట్లో ట్రక్కు బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకోవడం ద్వారా ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ దాడిలో, ఇప్పటి వరకు 76 మంది చనిపోగా, 200 మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ఐఎస్ ప్రకటించుకుంది. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకునే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News