: రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక
టీమిండియా స్పిన్నర్లు మరోసారి విరుచుకుపడ్డారు. కేవలం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్, మిశ్రా కేవలం 5 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్సులో 375 పరుగులకు టీమిండియాను శ్రీలంక బౌలర్లు కట్టడి చేయడంతో, 191 పరుగులు వెనకబడిన శ్రీలంక జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక ఆటగాళ్ల భరతం పట్టిన అశ్విన్, మిశ్రాలు మళ్లీ రంగంలోకి దిగడంతో శ్రీలంక ఓపెనర్లు కరుణరత్నె, సిల్వ ఆచితూచి ఆడారు. అద్భుతమైన బంతులు సంధించిన అశ్విన్, మిశ్రా పరుగులేమీ ఇవ్వకుండానే కరుణరత్నె, సిల్వ వికెట్లు కూల్చారు. అనంతరం దమ్మిక ప్రసాద్ (3), కుమార సంగక్కర (1) దిగారు. దీంతో శ్రీలంక జట్టు రెండో రోజు ఆటముగిసే సరికి నాలుగు ఓవర్లలో 5 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.