: నా దగ్గర దమ్మిడీ లేదు... ఖర్చులన్నీ భక్తులే చూసుకుంటారు!: రాధేమా


వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమా వీడియోలు చూస్తే అంతా అవాక్కవ్వాల్సిందే. ఖరీదైన నగలు, చీరలు, ఒత్తైన మేకప్ తో భక్తులకు దర్శనమిస్తుంది. భక్తులతో డాన్స్ చేస్తుంది. బోధలు చేస్తుంది. ఒకసారి విడిచిన దుస్తులను రెండోసారి వేసుకోదని అంతా చెబుతుంటారు. అలాంటి రాధేమా తన వద్ద అసలు డబ్బులే ఉండవని అంటోంది. తన బ్యాంకు ఖాతాలో మాత్రం మహావుంటే ఓ ఎనిమిది లేక పది లక్షల రూపాయలు ఉంటాయని ఆమె చెప్పింది. మరి దుస్తులు, మేకప్, నగలు సంగతేంటని అడిగితే, అవన్నీ భక్తులే ఇస్తారని, వారే తనకు మేకప్ చేస్తారని ఆమె అంటోంది. వరకట్న వేధింపుల ఆరోపణలతో నాసిక్ కుంభమేళాకు హాజరుపై నిషేధం విధించారట, నిజమేనా? అని అడిగితే, తాను వెళ్లాలనుకుంటే వెళ్లగలనని చెప్పింది. గతంలో చాలా కుంభమేళాలకు వెళ్లానని ఆమె తెలిపింది.

  • Loading...

More Telugu News