: కృష్ణా జిల్లాలో మూడు గ్రామాలను దత్తత తీసుకున్న జపాన్ సంస్థ


ఆకర్షణీయ గ్రామాల కింద ఏపీలోని కృష్ణా జిల్లాలో నాలి, సొర్లసొంది, మంగళాపురం గ్రామాలను ఎంపిక చేశారు. ఆ మూడు గ్రామాలను జపాన్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ మిత్సుబిషి దత్తత తీసుకుంటున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో మిత్సుబిషి సంస్థ, ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఆ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందని సీఎం అన్నారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. పట్టణాల్లోని సౌకర్యాలన్నీ పల్లెసీమల్లోనూ రావాలని తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు. జపాన్, భారత్ మధ్య సాంస్కృతిక సంబంధాలు చురుకుగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో జపాన్ భాషను ప్రోత్సహిస్తున్నామని, రాజధాని నిర్మాణంలో జపాన్ భాగస్వామ్యం కోరుతున్నామని చంద్రబాబు తెలిపారు.

  • Loading...

More Telugu News