: నెరవేరనున్న కల, త్వరలోనే నంద్యాల-ప్రొద్దుటూరు మధ్య రైలు
దశాబ్దాలుగా నెరవేరని కర్నూలు, కడప జిల్లా వాసుల కల త్వరలో సాకారం కానుంది. నంద్యాల నుంచి ప్రొద్దుటూరు వరకూ అతి త్వరలో పాసింజర్ రైలును ప్రారంభిస్తామని గుంతకల్ డివిజన్ రీజనల్ మేనేజర్ మాల్యా వెల్లడించారు. ఆయన ఆర్ఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా డివిజన్ లో పర్యటిస్తూ, ఈ మధ్యాహ్నం ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ పనులను పరిశీలించారు. ఆ తరువాత ఈ మార్గంలో నూతనంగా జరుగుతున్న పనులను సైతం పర్యవేక్షించారు. కొత్తగా ఏర్పాటవుతున్న రైల్వే స్టేషన్లు, భవనాలను పరిశీలించిన ఆయన పనులు జరుగుతున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.