: శ్రీహరికోట 'షార్'లో అగ్ని ప్రమాదం
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లో ఈ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ లో ఉన్న ఘన ఇంధన విభాగానికి చెందిన ఒక భవనంలో మంటలు చెలరేగాయి. జీఎస్ఎల్వీ ప్రయోగానికి సంబంధించి ఇంధనం మిక్సింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే, అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో, ఎలాంటి భారీ ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలేమన్నవి ఇంకా తెలియరాలేదు. ప్రమాదంలో ఒక షార్ ఉద్యోగికి, ఒక ఒప్పంద ఉద్యోగికి గాయాలయ్యాయని సమాచారం. ఈ నెలాఖరున ఈ జీఎస్ఎల్వీని ప్రయోగించనున్నారు.