: కాంగ్రెస్ ఓ కుటుంబాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తోంది: మోదీ


పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రవర్తన అత్యయిక పరిస్థితిని తలపిస్తోందని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు, భాగస్వామ్య పక్షాల నేతలతో పార్లమెంట్ కార్యాలయంలో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, దేశ రక్షణకు బీజేపీ శ్రమిస్తుంటే... కాంగ్రెస్ మాత్రం ఓ కుటుంబాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అనంతరం ఎన్డీఏ ఎంపీలు విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ చేపట్టారు.

  • Loading...

More Telugu News