: లలిత్ మోదీని రప్పించే ధైర్యం ప్రధాని మోదీకి ఉందా?: రాహుల్ గాంధీ


ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డ ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీని భారత్ కు రప్పించే ధైర్యం నరేంద్ర మోదీకి ఉందా? అని ప్రశ్నించారు. భోపాల్ గ్యాస్ విషాదంలో నిందితుడైన అండర్సన్ భారత్ నుంచి పరారవడానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తోడ్పడ్డారని బీజేపీ ఆరోపించిన నేపథ్యంలో, రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి హయాంలో న్యాయ వ్యవస్థ బాగా పని చేసేదని... అయినా, గత 30 ఏళ్ల నుంచి బీజేపీ ఈ అంశాన్ని ఎత్తి చూపుతూనే ఉందని... ఇది ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. ప్రస్తుత బీజేపీ హయాంలో నేరస్తులంతా హాయిగా ఉన్నారని మండిపడ్డారు. వ్యాపం కుంభకోణంలోని నిందితులను కూడా బీజేపీ ప్రభుత్వం కాపాడుతోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News