: 5 వేల కోట్లు ఖర్చు చేస్తామంటున్న కేసీఆర్... ఆ నిధులు ఎక్కడ నుంచి వస్తాయో చెప్పడం లేదు: షబ్బీర్ అలీ
గ్రామ జ్యోతి కార్యక్రమానికి రూ. 25 వేల కోట్లు ఖర్చు చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్... ఆ నిధులు ఎక్కడ నుంచి వస్తాయో చెప్పడం లేదని... ముందు ఆ విషయాన్ని స్పష్టం చేయాలని టీకాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. రోజుకొక వాగ్దానం చేస్తున్న కేసీఆర్... ఇంత వరకు ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. మొన్నటి దాకా మన ఊరు-మన ప్రణాళిక అంటూ హడావుడి చేసిన కేసీఆర్... ఇప్పుడు దాన్ని వదిలేసి, గ్రామ జ్యోతి అంటూ కొత్త నాటకాన్ని మొదలు పెట్టారని విమర్శించారు. చివరకు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును కూడా సరిగా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.