: ప్రపంచ సూపర్ కంప్యూటర్ 'తియాన్హే-1ఏ' షట్ డౌన్


వరల్డ్ సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ 'తియాన్హే-1ఏ'ను తాత్కాలికంగా షట్ డౌన్ చేసినట్టు చైనా ప్రకటించింది. ఒక సెకనుకు 2.57 క్వాడ్రిలియన్ ఆపరేషన్స్ పూర్తి చేసే సామర్థ్యమున్న ఈ కంప్యూటర్ తియాంజిన్ లోని నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్ లో ఉంది. ఈ తెల్లవారుఝామున జరిగిన పేలుళ్లతో సూపర్ కంప్యూటర్ ఉంచిన భవనం పైకప్పు దెబ్బతిన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని సెంటర్ డైరెక్టర్ గ్వాంగ్ మింగ్ వివరించారు. కంప్యూటర్ భద్రత కోసమే షట్ డౌన్ చేశామని అన్నారు. కాగా, వరల్డ్ టాప్ 500 సూపర్ కంప్యూటర్లలో 'తియాన్హే-1ఏ' తొలి స్థానంలో ఉంది.

  • Loading...

More Telugu News