: ఈ రైలు కనిపించుటలేదు!
రైలు కనిపించకపోవడమనేది చాలా అరుదైన సంఘటనే. మనదేశంలోనే చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... రాజస్థాన్ లోని జోథ్ పూర్ నుంచి ఓ గూడ్సు రైలు గుజరాత్ లోని ముంద్రా రేవుకు బయల్దేరింది. ఆ రైలును రంజన్ కన్సరా అనే వ్యక్తి బుక్ చేసుకున్నాడు. మొత్తం 90 కంటెయినర్లు, ఒక్కో కంటెయినర్ లో రూ.10 లక్షల విలువ చేసే సామగ్రి! రూ.9 కోట్ల విలువైన సామగ్రితో జులై 27న బయల్దేరిన ఆ గూడ్సు రైలు ఇప్పటిదాకా గమ్యం చేరుకోకపోవడం చర్చనీయాంశం అయింది. మూడు రోజుల్లో గుజరాత్ చేరాల్సిన రైలు ఎక్కడ ఉందో తెలియక రంజన్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. రైల్వే శాఖను సంప్రదించగా, ఆగస్టు 2 నుంచి ఆ రైలు అహ్మదాబాదులో ఉన్నట్టు ఆన్ లైన్ స్టేటస్ చెబుతోంది. అక్కడ చూస్తే రైలు లేదు! వర్షాల కారణంగా ఎక్కడైనా చిక్కుకుపోయిందేమోనని రైల్వే అధికారులు రంజన్ కు తెలిపారు. ఎక్స్ పోర్ట్ బిజినెస్ చేసే రంజన్ ను ఈ పరిణామం దిగ్భ్రాంతికి గురిచేసింది.