: 'రాధే మా'పై ఫిర్యాదు చేసిన బాలీవుడ్ నటి డాలీ
బాలీవుడ్ నటి డాలీ బింద్రా వివాదాస్పద 'గాడ్ ఉమన్' 'రాధే మా'పై ముంబయి పోలీస్ కమిషనర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చంపేస్తామంటూ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఈ విషయంలో రాధే మా, ఎంఎం గుప్తా, మరికొందరు భక్తులపై అనుమానాలు ఉన్నాయని డాలీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ... పోలీసులకు ఫిర్యాదు దాఖలు చేశానని, వారు దర్యాప్తు చేస్తారని తెలిపారు. డాలీ బింద్రా గతంలో రాధే మా భక్తురాలే. కాగా, రాధే మా కు ఇప్పటికే వరకట్న కేసులో ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. నిక్కీ గుప్తా అనే మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు వరకట్న కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసులో రాధే మా స్టేట్ మెంట్ రికార్డు చేయనున్నారు.