: నవేద్ కోసం స్పెషల్ ఫ్లయిట్!


జమ్మూ కాశ్మీర్ లో పట్టుబడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది నవేద్ ను నేడు ప్రత్యేక విమానంలో జమ్మూ నుంచి ఢిల్లీకి తరలించనున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు అతనికి 14 రోజుల కస్టడీని విధించిన సంగతి తెలిసిందే. నవేద్ ను మరింత లోతుగా విచారించే నిమిత్తం ఢిల్లీకి తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఉధంపూర్ లో బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి ఆపై పారిపోయిన నవేద్ ను స్థానికులు తమ సాహసంతో సైన్యానికి పట్టించిన సంగతి తెలిసిందే. అతనిని విచారించిన పోలీసులు, అతనికి సహకరించిన వారిని, భారత్ లో ఉంటూ పాక్ ఉగ్రవాదులకు సానుభూతిపరులుగా ఉన్న వారిలో పలువురిని అరెస్ట్ చేశారు. నవేద్ కు 12 మంది ఉగ్రవాదులతో లింకులున్నాయని అధికారులు గుర్తించారు. భద్రతాంశాల కారణంగానే ప్రత్యేక విమానంలో నవేద్ ను తీసుకువెళ్తున్నట్టు ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News