: 'పీఎస్ఎల్'... ఐపీఎల్ స్ఫూర్తిగా కొత్త లీగ్
బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మిగతా దేశాల బోర్డులకు స్ఫూర్తినందిస్తోంది. తాజాగా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సరికొత్త లీగ్ కు శ్రీకారం చుడుతోంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) పేరిట నిర్వహించే ఈ లీగ్ ఫ్రాంచైజీల విక్రయం, ప్రసార హక్కులు, స్పాన్సర్ షిప్ కోసం సెప్టెంబరులో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభ ఎడిషన్ పోటీలను ఐదు ఫ్రాంచైజీలతో దోహా, ఖతార్ దేశాల్లో నిర్వహించాలని పీసీబీ తలపోస్తోంది. ప్రతి ఫ్రాంచైజీలో 16 మంది ఆటగాళ్లు ఉంటారు. ఫ్రాంచైజీలో నలుగురు లేదా ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు అనుమతి ఉంటుంది.