: నేపాల్ ను హిందూ దేశంగా ప్రకటించండి... మద్దతు పలుకుతున్న నేపాలీ ముస్లింలు
నేపాల్ ను హిందూ దేశంగా ప్రకటించాలనే డిమాండ్ ఆ దేశంలో ఊపందుకుంటోంది. తాజాగా ఈ డిమాండ్ కు అక్కడున్న ముస్లింలు కూడా మద్దతు పలికారు. నేపాల్ లౌకిక దేశంగా కొనసాగడం వల్ల భవిష్యత్తులో పలు సమస్యలు ఉత్పన్నమవుతాయని సీపీఎన్-యూఎంఎల్ సీఏ సభ్యుడు అనార్కలీ మియా చెప్పారు. నేపాల్ లో ఉన్న మిషనరీలు స్థానికులను క్రైస్తవం అనుసరించేలా చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. నేపాల్ రఫ్తి ముస్లిం సొసైటీ ఛైర్మన్ అజ్మత్ మాట్లాడుతూ, నేపాల్ లౌకిక దేశంగా కొనసాగడం కంటే... హిందూ దేశంగా కొనసాగడమే మేలని స్పష్టం చేశారు. నేపాల్ లో ఇస్లాం మతాన్ని కాపాడుకోవాలంటే... ఈ దేశం హిందూ దేశంగానే ఉండాలని ఆయన అన్నారు.