: తనకు క్యాన్సర్ సోకిందని చెప్పి విరాళాలు కొల్లగొట్టిన వయ్యారిభామ


ఈవేళ సోషల్ మీడియా ఓ స్థాయికి వెళ్లిపోవడంతో సాధారణ విషయాలపైనా తీవ్ర స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. అది ఎలాంటి అంశమైనా కానివ్వండి... వెంటనే స్పందించే వాళ్లకు కొదవలేదు. సరిగ్గా ఈ వీక్ నెస్ పైనే దెబ్బకొట్టింది ఓ వయ్యారిభామ. అమెరికాలోని పెన్సిల్వేనియాలో బ్రాండ్లీ వీవర్ గేట్స్ అనే యువతి మిస్ పెన్సిల్వేనియా కిరీటం గెలుచుకుంది. దాంతో, కాస్త పేరుప్రఖ్యాతులు లభించాయి. అయితే, తనకు క్యాన్సర్ సోకిందని, దాతలు ఆదుకోవాలని ఆన్ లైన్ లో ఓ విజ్ఞప్తి పడేసింది. అందాలభామ... అందునా తీవ్ర వ్యాధితో బాధపడుతోందని భావించి కరిగిపోయిన సహృదయులు విరాళాలు వెల్లువెత్తించారు. అలా 14 వేల డాలర్లు పోగయ్యాయి. ఇంతలో ఓ వ్యక్తి ఆకాశరామన్న ఉత్తరం రాయడంతో అమ్మడి గుట్టు రట్టయింది. విచారణ చేపట్టిన పోలీసులు నిగ్గు తేల్చారు. బ్రాండ్లీ తప్పు చేసినట్టు కోర్టు కూడా నిర్ధారించింది. అటు, మిస్ పెన్సిల్వేనియా అందాల పోటీల నిర్వహించిన బట్లర్ బ్యూటీస్ సంస్థ బ్రాండ్లీకి బహుకరించిన కిరీటాన్ని వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News