: సెప్టెంబర్ లో సీఎం కేసీఆర్ చైనా పర్యటన
తెలంగాణ సీఎం కేసీఆర్ సెప్టెంబర్ లో చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఆ నెల 9వ తేదీ నుంచి ఆయన పర్యటన మొదలవుతుంది. దాదాపు ఆరు రోజుల పాటు సీఎం పర్యటన ఉంటుంది. సెప్టెంబర్ 9 నుంచి 14వరకు జరిగే ఎకనమిక్ ఫోరం సదస్సులో కేసీఆర్ పాల్గొంటారు. తరువాత తిరిగి రాష్ట్రానికి వస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు.