: మా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి: పొన్నాల


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అనేకమంది ఫోన్లు ట్యాప్ చేశారంటూ, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో తమ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఓటుకు నోటు కేసుకన్నా ముందు నుంచే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన నేరమని పొన్నాల చెప్పారు. ఫోన్లు ట్యాప్ చేయలేదని టీఎస్ ముఖ్యమంత్రి చెప్పగలరా? అని ప్రశ్నించారు. రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తున్న కేసీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News