: దేశంలోనే తొలిసారి... పంద్రాగస్ట్ వేడుకల్లో తెలంగాణ ఖైదీల 'లెఫ్ట్ రైట్'!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వినూత్నంగా ఆలోచిస్తూ, వివిధ జైళ్లలో సంస్కరణలు తెచ్చిన జైళ్ల శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఖైదీలతో కవాతు చేయించనుంది. ఇండియాలో ఖైదీలతో కవాతు చేయించడం ఇదే తొలిసారి. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో 'సికా' మైదానంలో జరిగే వేడుకల్లో ఎంపిక చేసిన ఖైదీలు 'లెఫ్ట్ రైట్' అంటూ పరేడ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి సత్ప్రవర్తన చూపుతున్న ఖైదీలను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారట.