: మరో వారంలో ఎగరనున్న 'డ్రీమ్ లైనర్లు'


బ్యాటరీ లోపాలతో నేలకు దిగిన బోయింగ్ ప్రతిష్ఠాత్మక డ్రీమ్ లైనర్-787 విమానాలు మరోవారంలో ఎగరనున్నాయి. గత జనవరిలో లిథియం అయాన్ బ్యాటరీల్లో లోపాలు తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా 50 విమానాలను నిలిపివేయాలని బోయింగ్ నిర్ణయించింది. అధికవేడిమిని తట్టుకోలేకపోవడంతో వాటిలో మంటలు చెలరేగాయి. తీవ్రంగా శ్రమించి ఆ లోటుపాట్లను సరిదిద్దిన బోయింగ్ సంస్థ వాటిని విమానాల్లో అమర్చే ప్రక్రియ మొదలుపెట్టింది. తొలి విడతగా ఐదు జపాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన డ్రీమ్ లైనర్లలో నూతన బ్యాటరీలను అమర్చుతారు.

  • Loading...

More Telugu News