: ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ సదస్సుకు పురందేశ్వరికి ఆహ్వానం
అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాలంటూ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా మోర్చా ఇన్ చార్జి డి.పురందేశ్వరికి ఆస్ట్రేలియా నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 14 నుంచి 16 వరకు అడిలైడ్ లో సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియా భారత్ నుంచి పురందేశ్వరికి ఆహ్వాన పత్రం పంపింది. ముందుగా మహిళల సమాఖ్య కమిటీ సదస్సులో ఆమె పాల్గొంటారు. అనంతరం దక్షిణ ఆస్ట్రేలియా లిబరల్ పార్టీ వార్షిక సమావేశాలకు పరిశీలకురాలిగా కూడా వ్యవహరిస్తారు. వివిధ దేశాలకు చెందిన రాజకీయ పార్టీల నేతలను సదస్సుకు ఆహ్వానించగా, మన దేశం నుంచి కేవలం పురందేశ్వరికే అవకాశం లభించడం విశేషంగా చెప్పుకోవాలి.