: కేపీహెచ్ బీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!


కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టెక్కీ తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీ ఫేజ్-3లో ఉమారాణి అనే మహిళ ఉస్మానియా ఆసుపత్రిలో ఉద్యోగిని. ఆమె కూతురు సంధ్య హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. తల్లి రోజూ మాదిరిగా ఉదయం ఆసుపత్రికి వెళ్లి సాయంత్రం వచ్చేసరికి సంధ్య, తన బెడ్ రూంలోని ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించింది. తాను రాసిపెట్టిన సూసైడ్ నోట్ లో, కొంత కాలంగా గుండె నొప్పితో బాధపడుతున్నానని, తండ్రి మరణం తరువాత మానసికంగా ఒత్తిడిలో ఉన్నానని రాసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News