: నేడు సీఐఐ ప్రతినిధులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ ఉదయం 10.30 గంటలకు సీఐఐ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. అనంతరం, ఉదయం 11.15 గంటలకు విజయవాడలో 'కోడ్ ఫర్ ఏపీ' కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అటుపై, జపాన్ కు చెందిన మిత్సుబిషి కార్పొరేషన్ స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటారు.