: ఏపీ సీడ్ క్యాపిటల్ ను 'చల్ల'బరుస్తారట!


ఏపీలో విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో సింగపూర్ బృందానికి అనుభవంలోకి వచ్చింది. ఇటీవల వారు ఇక్కడ పర్యటించిన సమయంలో వేడి, ఉక్కపోతతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రాజధాని ప్రాంతంలో ఇలాంటి వాతావరణం ఉండరాదని భావించిన వారు ఓ పక్కా ప్రణాళికను రూపొందించి ఏపీ సర్కారుకు అందించారు. ఆ ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మాణంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా అమరావతిలో చల్లని వాతావరణం నెలకొంటుందని భావిస్తున్నారు. మామూలుగా, కృష్ణానది మీదుగా ఈశాన్య గాలులు ఎప్పుడూ వీస్తుంటాయి. ఆ గాలులకు విఘాతం కలగకుండా ఉండేందుకు కృష్ణా రివర్ ఫ్రంట్ వైపు ఆకాశ హర్మ్యాల నిర్మాణం చేపట్టరు. ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పార్కులు, కాలువలు, ట్యాంక్ బండ్ తరహా చెరువులు ఏర్పాటు చేస్తారు. పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచుతారు. రాజధానిలో ప్రభుత్వ, ప్రైవేటు భవనాలన్నింటినీ గ్రీన్ తరహాలో నిర్మిస్తారు. వాటిలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండేలా చూస్తారు. ఆ ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు పెంచడం ద్వారా వాతావరణం కాలుష్యం తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ప్రయత్నాలతో వేసవిలోనూ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా చేస్తారు.

  • Loading...

More Telugu News