: భారత స్పిన్నర్లు పరిస్థితులను బాగా ఉపయోగించుకున్నారు: చాందిమల్
గాలే టెస్టు తొలి రోజు ఆటలో శ్రీలంక జట్టు దారుణ ప్రదర్శన కనబర్చడంపై వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ చాందిమల్ స్పందించాడు. భారత స్పిన్నర్లు పరిస్థితులను బాగా ఉపయోగించుకున్నారని అభిప్రాయపడ్డాడు. రెండుమూడు రోజులుగా ఇక్కడి పిచ్ పై కవర్లు కప్పి ఉంచారని, ఇవాళ ఉదయం కవర్లు తొలగించగానే కాస్త తేమ కనిపించిందని చెప్పాడు. మధ్యాహ్నానికి పిచ్ పొడిబారిందని, పిచ్ పై మరీ టర్న్ లేకపోయినా గానీ తాము విఫలమయ్యామని చెప్పుకొచ్చాడు. భారత స్పిన్నర్లు తమను గుక్కతిప్పుకోనివ్వలేదని తెలిపాడు. ఇక, రెండో ఇన్నింగ్స్ లోనైనా రాణించేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు.