: ప్రముఖ నటికి డబ్బింగ్ పాఠాలు చెబుతున్న దిగ్గజ నటుడు


ప్రముఖ నటి త్రిషకు దిగ్గజ నటుడు కమల్ హాసన్ డబ్బింగ్ పాఠాలు చెబుతున్నాడు. ఈ విషయాన్ని త్రిష వెల్లడించింది. వీరిద్దరూ కలిసి నటించిన తూంగావనం సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. తమిళనాడుకి చెందిన త్రిష ఇంతవరకు తన సినిమాలకు డబ్బింగ్ చెప్పుకోలేదు. తొలి సారిగా తూంగవనం సినిమాకు డబ్బింగ్ చెప్పుకుందామని నిర్ణయించింది. అయితే నైపుణ్యంతో డబ్బింగ్ చెప్పడానికి శిక్షణ తీసుకోవాలని భావించింది. ఈ విషయంలో త్రిషకు శిక్షణ ఇచ్చేందుకు కమల్ హాసన్ ముందుకు రావడంతో బుద్ధిగా త్రిష డబ్బింగ్ నేర్చుకుంటోంది. ఈ విషయాన్ని త్రిష ట్విట్టర్లో చెప్పింది. 'అభిరుచికి వృత్తి జతకూడితే అంతా అనందమే' అంటూ ట్వీట్ ద్వారా తన సంతోషాన్ని త్రిష వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News